టీవీ9పై వర్మ క్రిమినల్ కేసు

సంఘంలోని ప్రముఖులను ఉద్దేశించి ఎప్పుడూ ఏవో వాఖ్యలతో వార్తలో నిలిచే వర్మ .. ఇప్పుడు ఏకంగా ఒక న్యూస్ ఛానల్ పై పడ్డాడు. టీవీ9 చానెల్‌పై క్రిమినల్‌ అభియోగాలతో పలు కేసులు దాఖలు చేయనున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించాడు ఆర్జీవీ. ప్రస్తుతం తాను ఆ ప్రక్రియలో ఉన్నానని, తన లాయర్లు అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ట్వీట్‌లో తెలిపాడు.

టీవీ9 మూర్ఖపు కథనాలు ప్రసారం చేస్తోందని, ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్‌లో ఆ కథనాలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నానని, టీవీ9 పేరును టీవీ9 సర్కస్‌ జోకర్స్‌గా మార్చాలంటూ ఘాటుగా విమర్శించిన వర్మా ఇప్పుడు ఆ చానెల్‌పై వర్మ కేసులు దాఖలు చేస్తానని అంటున్నాడు.

ఇటీవల వివాదాస్పద ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ వెబ్‌సినిమా విషయంలో వర్మ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ నేపధ్యంలో తనపై తప్పుడు వార్తలు ఇచ్చారనేది వర్మ ఆరోపణ.