Site icon TeluguMirchi.com

రంగస్థలంపై వర్మ కామెంట్ ఇది

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకెబిందెలాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..
సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే చేతికందిన చందమామ లాగ ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
మల్లెపూల మధ్య ముద్దబంతి లాగా ఎంత సక్కగున్నావె ముత్తయిదువుల మెళ్లో పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నావె
చుక్కలసీర కట్టుకున్న వెన్నెల లాగ ఎంత సక్కగున్నావె
యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకెబిందెలాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..
సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే చేతికందిన చందమామ లాగ ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ లిరిక్సే అవినిపిస్తున్నాయి. రంగస్థలంలోని పాట ఇది. ఇపుడు ఈ పాట వైరల్ అవుతుంది.

తాజాగా ఈ పాటపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ”సుకుమార్‌ ‘రంగస్థలం’ టీజర్ ఎంతగానో నచ్చింది. కానీ ఈ పాట రంగస్థలంను మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంది. ఈ పాటకు సాహిత్యం అందించిన చంద్రబోస్‌కు, సంగీంత అందించిన డీఎస్పీకి మిలియన్‌ చీర్స్‌” అంటూ ట్వీట్ చేశారు వర్మ.

Exit mobile version