కళాతపస్వి పై వర్మ కామెంట్స్

rgv (6)

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూటే వేరు. అందరూ అలోచించే దారిలో అలోచించడు వర్మ. కొత్త యాంగిల్ పట్టుకుంటాడు. తాజాగా కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం దక్కడం పట్ల రామ్‌గోపాల్‌ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

”నేను దాదా సాహెబ్‌ ఫాల్కే సినిమాల్ని చూశాను.. విశ్వనాథ్‌గారి సినిమాలు చూశాను.. మీ పేరుతో దాదా సాహెబ్‌ ఫాల్కేకి అవార్డు ఇవ్వాలి..’ అంటున్నాడు వర్మ. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే కంటే మీరు చాలా గొప్పవారు.. అందుకే మీకు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ రావడం నన్ను పెద్దగా ఇంప్రెస్‌ చేయలేదు..’ అని చెప్పుకొచ్చాడు ఆర్జీవి.

కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం దక్కడం పట్ల మొత్తం సినీ పరిశ్రమ అంతా ఆనందం వ్యక్తం చేసింది. కాని వర్మ మాత్రం వెరైటీ స్పదించి మళ్ళీ వార్తల్లో నిలిచాడు.