Site icon TeluguMirchi.com

ఆసుపత్రిలో చేరిన వర్మ… ఐసీయూలో చికిత్స

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు ఇతరులపై సంచలన కామెంట్‌లు చేస్తూ బాగా పాపులర్‌ అవుతూ ఉంటాడు. అలాంటి వర్మకు తాజాగా వైరస్‌ సోకి ఆసుపత్రిలో ఉన్నాడట. ఐసీయూలో చికిత్స పొందుతున్న వర్మకు ఏ మందులు ఇవ్వాలో ప్రముఖ వైద్యులకు సైతం అంతుపట్టడం లేదట. ఇదంతా ఫేక్‌ న్యూస్‌ కాదు, స్వయంగా వర్మనే ట్వీట్‌ చేశాడు. అదేంటి వర్మ ఐసీయూలో ఉంటే ట్వీట్లు ఎలా చేస్తాడు అనేగా మీ సందేహం. అదేనండి వర్మకు సోకిన ఆ వైరస్‌ ఏంటి అంటే ‘బాహుబలి 2’ జలసైటిస్‌ అంటా! ‘బాహుబలి 2’ చిత్రంపై ఉన్న అసూయ వల్లనే వర్మకు ఇలా అయ్యిందనే వర్మనే చెబుతున్నాడు.

కేవలం తన ఒక్కడికే కాకుండా మనదేశంలో ఉన్న ఫిల్మ్‌ మేకర్‌ దిగ్గజాలందరికి కూడా ఈ వైరస్‌ సోకిందని, అందరు అసూయతో బాదపడుతున్నారని, డాక్టర్లకు కూడా ఈ వైరస్‌కు ఎలాంటి మందులు ఇవ్వాలో తెలియడం లేదు అంటూ తనదైన రీతిలో వర్మ ‘బాహుబలి 2’ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాకుండా ‘బాహుబలి 2’ చిత్ర శబ్దాన్ని వినలేక బాలీవుడ్‌ దిగ్గజ దర్శకనిర్మాతలంతా కూడా చెవుల్లో దూదులు పెట్టుకున్నారని, ‘బాహుబలి 2’ పేరు చెబితే వణికిపోతున్నారని వర్మ చెబుతూ రాజమౌళిపై, ‘బాహుబలి’ టీంపై పొగడ్తల వర్షం కురిపించాడు.

Exit mobile version