సినిమా కథ విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. సినిమా విడుదలయ్యేంత వరకూ లైన్కూడా చెప్పరు. కథేంటిసార్..?? అని అడిగితే తెరపై చూడండి.. అంటూ ముసి ముసిగా నవ్వుతారు. స్టిల్స్ కూడా కొన్నే విడుదల చేస్తారు. టీజర్ ముఫ్ఫై సెకన్లకు దాటదు. కథ చెబితే జనం ఎక్కువగా ఊహించుకొంటారన్న భయమో ఏమో మరి. అయితే రాంగోపాల్ వర్మ మాత్రం చాలా డిఫరెంట్. తన సినిమా విడుదల కాకముందే అందులో సీన్లకు సీన్లు ముందే చూపించేస్తాడు వర్మ. 26/11 , రక్త చరిత్ర, రౌడీ ఈ సినిమాలకు సంబంధించి కొన్ని సన్నివేశాల్ని విడులకు ముందే చూపించేశాడు. సినిమా మొదటి పది హేను నిమిషాలూ ఇలా ఉండబోతోందని క్లారిటీగా చెప్పేశాడు. అవి చూసి సినిమాపై ఓ అంచనాకు ఈజీగా వచ్చేయొచ్చు. ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లోని సన్నివేశాల్ని విడుదలకు ముందే మీడియాకు చూపించనున్నాడు వర్మ. ఆయా సన్నివేశాలు పాజిటీవ్ రెస్పాన్స్ తీసుకొస్తే ఫర్వాలేదు. నెగిటీవ్‌గా అనిపిస్తే మాత్రం సినిమాకే చాలా చాలా నష్టం. ఈ సంగతి తెలిసి కూడా… ధైర్యంగా అడుగు వేస్తున్నాడు. సినిమా హిట్టు, ఫ్లాపులను పక్కన పెట్టి… వర్మ తెగువను మాత్రం మెచ్చుకోవాల్సిందే.