రేయ్.. రాలేకపోతున్నాడు!

rey

సాయిధరమ్ తేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ’రేయ్’. వై.వి.ఎస్ చౌదరి దర్శకుడు. సయామీఖేర్, శ్రద్ధాదాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏమైందో ఏమోగానీ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన దగ్గరి నుంచి.. అన్నీ అడ్డంకులే ఎదురవుతూ వున్నాయి. సినిమా ఎప్పటికికప్పుడూ వాయిదా పడుతూ వస్తోంది. ఈచిత్రాన్ని మే9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసింది. ఆరోజే సూపర్ స్టార్ రజినీకాంత్ ’విక్రమసింహ’ విడుదలకానుండటంతో.. ’రేయ్’ మళ్లీ వెనక్కు వెళ్లనుంది. నయా టెక్నాలజీతో వస్తోన్న ’విక్రమసింహ’ను తట్టుకోవడం ’రేయ్’కి కష్టమే. ఈ నేపథ్యంలో.. మే9న కూడా రేయ్.. రాలేకపోతున్నాడు. మరీ.. రేయ్ రిలీజ్ డేట్ ఎప్పుడో ..