శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్ చిన్నప్పటి నుండే హైదరాబాద్‌లో పెరిగాడు. ఇండియన్ ఐడల్‌లో రేవంత్ మొదటి నుండి కూడా పై చేయి సాధిస్తూ వచ్చాడు. ఫైనల్‌లో కూడా అద్బుత ప్రతిభతో విజేతగా నిలిచాడు. పంజాబ్‌కు చెందిన ఖుదా బక్ష్ రెండవ స్థానంలో నిలువగా, మూడవ స్థానంలో మరో తెలుగు తేజం పీవీఎస్‌ఎన్ రోహిత్ ఉన్నాడు. ఇండియన్ ఐడల్‌లో విజేతగా నిలిచిన రేవంత్‌కు 25 లక్షల నగదు బహుమతి దక్కింది. అలాగే సోని కంపెనీతో ఒక భారీ ఒప్పందంతో పాటు మహింద్ర కంపెనీకి చెందిన కేయూవీ100 వాహనం గిఫ్ట్‌గా రేవంత్ అందుకున్నాడు.
రేవంత్‌కు తెలుగు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు సిద్దం అవుతున్నారు. ఈ విజయం తర్వాత తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సంబురాలు చేసుకుంటాను అంటూ రేవంత్ చెప్పుకొచ్చాడు. రేవంత్‌కు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
తెలుగుమిర్చి తరపున ఇండియన్ ఐడల్, తెలుగు తేజం రేవంత్ కు హార్ధిక శుభాకాంక్షలు