Site icon TeluguMirchi.com

చెర్రీ కోసం త్యాగం చేసిన బ‌న్నీ

charanఈ సంక్రాంతికి అల్లు అర్జున్ సంద‌డి చేస్తాడ‌నుకొన్నారంతా..! బ‌న్నీ – సురేంద‌ర్‌రెడ్డి క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొంటున్న రేసుగుర్రం సినిమాని ఈ సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌ని ముందు నుంచీ చిత్రబృందం చెబుతూ వ‌స్తోంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావ‌డం లేద‌ట‌. ఫిబ్రవ‌రిలో విడుద‌ల చేయాల‌ని తాజాగా చిత్రబృందం నిర్ణయం తీసుకొన్నట్టు స‌మాచార‌మ్‌. డిసెంబ‌ర్‌కి రావ‌ల్సిన ఎవ‌డు సంక్రాంతికి వాయిదా ప‌డింది. ఆ సినిమాలో బ‌న్నీ కూడా ఉన్నాడు. మెగా ఫ్యామిలీ హీరోల‌కు చెందిన రెండు సినిమాలు ప‌క్క ప‌క్కనే విడుద‌ల చేస్తే ఇబ్బందే. అందుకే చ‌ర‌ణ్ కోసం బ‌న్నీ వెన‌క‌డుగు వేశాడు. రేసుగుర్రం సినిమాకి ఫిబ్రవ‌రి 7న విడుద‌ల చేస్తార‌ని విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌.

Exit mobile version