‘రేసు’ నుంచి తప్పుకున్నాడా ?

bunnyఅల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ సంక్రాతి సీజన్ రేసు నుంచి తప్పుకుందా ? అంటే.. అవుననే వినిపిస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘రేస్ గుర్రం’ . ఈ చిత్రాన్ని 2014 సంక్రాంతి కి రిలీజ్ చేయాలని బావించారు. అయితే చరణ్ ‘ఎవడు’ తో రెడీ గా వుండడం తో బన్నీ తన రేసు గుర్రాన్ని ఫిబ్రవరికి తీసుకెళ్ళాడు. ఇప్పడు ఫిబ్రవరి కి కూడా ఈ చిత్రం లేనట్టేఅని వినిపిస్తుంది. అందుకు కారణం.. బన్ని తమ్ముడు శిరీష్ హీరోగా నటించిన ‘కొత్త జంట’ చిత్రం తో ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న విడుదలకు సిద్దమైపోయింది. దీంతో తమ్ముడు శిరీష్ కె మొదటి ప్రాధాన్యత ఇచ్చి , బన్నీ ‘రేసు గుర్రాన్ని వేసవికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ వాయిదా విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.