ఇద్దరమ్మాయిలతో ఫలితం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ని నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన ఆశలన్నీ రేసుగుర్రంపైనే. ఇదో స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్. శ్రుతి హసన్ హీరోయిన్. సురేందర్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇటివలే చిత్రంలోని పాటలను రిలీజ్ చేశారు. బన్నీ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.