Site icon TeluguMirchi.com

గిరాకీ ‘గుర్రం’ !

girakiటాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోల ఆడియో రైట్స్ కు ఉండే క్రేజే వేరు. అందుకోసం పెద్ద మొత్తాలని చెల్లించటానికి ఆడియో కంపెనీలు ఎగబడతాయి.ఇటీవలే మహేష్ వన్ ఆడియో రైట్స్ భారీగానే అమ్ముడు పోయాయి. తాజాగా అల్లు అర్జున్ సినిమా ఆడియో రైట్స్ మాంచి గిరాకీ నే లభించింది. అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రేసు గుర్రం’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో బారి రేటుకి అమ్ముడుపోయినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. లహరి ఆడియో కంపెనీ వారు 55 లక్షలు చెల్లించి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ టాక్. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతం లో సురేందర్ రెడ్డి, తమన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కిక్’ మ్యూజికల్ హిట్ అనే చెప్పాలి. మరి ‘రేసుగుర్రం’ కు తమన్ ఏ మేరకు న్యాయం చేస్తాడో చూడాలి. ఇక బన్నీ కి తమన్ మ్యూజిక్ అందించడం ఇదే తొలిసారి. దీంతో ఆడియో పై మరింత ఆసక్తి పెరిగింది.

Exit mobile version