బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో పీకల్లోతు ప్రేమాయణం నడిపించి అందరితో దూరం అవుతూ వస్తున్నాడు. ఈయన మిస్ ఇండియా ఐశ్వర్యరాయ్‌తో కూడా ఘాటు ప్రేమాయణం నడిపాడు. ఇద్దరు కలిసి చాలా రోజులే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఘాఢంగా ప్రేమించుకున్నారు. ఏమయిందో ఏమో మధ్యలో ఐష్ సల్మాన్‌కు దూరంగా ఉంది. దాంతో కోపంతో రగిలిపోయిన సల్మాన్ బాగా తాగి కారు నడిపి చాలామంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన సల్మాన్ ఐష్‌తో విడిపోవడానికి కారణం ఏంటో చెప్పేశాడు.
బేసిక్‌గా తనకు చాలా కోపమని, అందువల్ల ప్రేమలో ఉన్న సమయంలో కూడా ఐశ్వర్య మీద చాలా సార్లు చేయి చేసుకున్నానని అన్నాడు. దాంతో ఈ విషయం పసిగట్టిన ఐశ్వర్య తండ్రి నన్ను చేసుకోవద్దు అని ఆమెకు చెప్పాడట. సల్మాన్‌కు చాలా కోపం ఉంది, ఆయన్ను పెళ్లి చేసుకుంటే నీకు సమస్యలు తప్పవు అంటూ హెచ్చరించాడు. దాంతో ఐష్ నాకు దూరంగా ఉంటూ వచ్చింది. ఐశ్వర్య తండ్రి చెప్పినట్టు నాకు కోపం చాలా ఎక్కువ. కోపం వస్తే తట్టుకోలేకుండా వెంటనే ఎదుటి వారిపై చూపిస్తాను, అందుకే ఐష్‌తో బ్రేకప్ అయ్యింది, అంతేకాకుండా చాలామందితో విభేదాలు వస్తున్నాయి అని సల్మాన్ క్లారిటీగా చెప్పాడు.