Site icon TeluguMirchi.com

ఫియాన్సీ కి థాంక్స్ చెప్పిన రేణు దేశాయ్..

పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ లో చాల మార్పులే కనిపించాయి. ముఖ్యంగా ఈమె రెండో వివాహం చేసుకోబోతుందనే వార్త బయటకొచ్చినప్పటినుండి అప్పటి వరకు ఎంతో అభిమానించిన పవన్ అభిమానులు ఆమెపై విరుచుకుపడడం స్టార్ట్ చేసారు. ఈమె ఏం చేసిన దానిని నెగిటివ్ గానే ప్రచారం చేస్తూవచ్చారు. అప్పట్లో రేణు vs పవన్ అభిమానులు అన్నట్లు సోషల్ మీడియా లో పెద్ద వారే జరిగింది. ఆ తర్వాత రేణు దేశాయ్ క్లారిటీ ఇవ్వడం తో వివాదం సద్దుమణిగింది.

తాజాగా మరోసారి వివాదం నెలకొనబోతున్నట్లు ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్ధమవుతుంది. తాజాగా రేణు దేశాయ్ తాను తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కాకపోతే ఆ ఫొటోస్ తీసింది కాబోయే భర్త కావడం విశేషం. ఆ విషయాన్నీ స్వయంగా ధృవీకరిస్తూ ఫియాన్సీ గారికి థాంక్స్ అంటూ అందులో పోస్ట్ చేసింది. మరి ఈ పోస్ట్ ఫై అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో అని అంత మాట్లాడుకుంటున్నారు.

Exit mobile version