రేణుకు పవన్ ఫై గాలి మళ్లిందా..అందుకే ఇలా ప్రేమ కవితలా..?

పవన్ కళ్యాణ్ ..రేణు ఇద్దరు ప్రేమించుకున్నారు..ఇద్దరు కలిసి సహజీవనం చేసారు..ఇద్దరు బిడ్డకు జన్మనిచ్చారు..ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయారు. పవన్ నుండి దూరమయ్యాక రేణు పిల్లలను చూసుకుంటూ ఉంటె..పవన్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ మధ్యనే రేణు దేశాయ్ రెండవ వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. దాదాపు ఏడాది క్రితమే రెండవ పెళ్లి కోసం నిశ్చితార్థం కూడా చేసుకుంది.

అంత ఈమె పెళ్లి కోసం ఎదురూహచూస్తున్న సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక కవిత సినీ వర్గాల్లో మరియు పవన్ ఫ్యాన్స్ లో చర్చనీయాంశం అయ్యింది. ఆ కవిత రేణు దేశాయ్ గతాన్ని గుర్తు చేసుకుని రాసిందని కొందరు.. పవన్ పై ఉన్న ప్రేమతో రాసిందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆ కవిత విషయానికి వస్తే.. ప్రేమను మళ్లీ నేర్చుకోవడం సాద్యమేనా… ? మొదటి సారి ప్రేమలో పడ్డప్పుడు వచ్చిన నవ్వు ఇప్పుడు వస్తుందా..? ఒకసారి అద్దంలో మొహం చూసుకుంటే మీరు కోల్పోయింది ఏంటో మీకే అర్థం అవుతుంది. నిద్ర లేని రాత్రులు గడిపే వారికి వారి ప్రేమ గురించి తెలుస్తుందంటూ తన కవితలో పేర్కొంది. గతంలో కూడా చాలా కవితలు పోస్ట్ చేసింది రేణు. కాని ఇలాంటి కవిత మాత్రం ఆమె ఎప్పుడు పోస్ట్ చేయలేదని.. ఆమె కవితలోనే ఏదో అనుమానం వ్యక్తం అవుతుందంటూ అంత మాట్లాడుకుంటున్నారు. మరి ఆ కవితకు అర్ధం ఏంటో రేణు నే తెలపాలి.