Site icon TeluguMirchi.com

చిన్నపిల్లల మధ్య రేణు ..

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ నిత్యం ఏదో ఒక వార్త తో తెలుగు మీడియా లో వైరల్ అవడం జరుగుతూనే ఉంది. అది సినిమాల పరంగానైనా ..వ్యక్తి గత విషయాల పరంగానైనా ఏదో ఒక విషయం లో ఈమె వార్తల్లో నిలుస్తుంటుంది. కొన్ని రోజుల క్రితం ఈమె సిల్వర్ స్క్రీన్ ఫై రీ ఎంట్రీ ఉండబోతున్నట్టుగా వార్తలు వినిపించి హల్చల్ చేయగా..ప్రస్తుతం రేణు కొన్నేళ్లుగా పిల్లలతో సహా పూణేలో ఉంటుంది. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ వచ్చి పోతూ ఉంది. ఈ క్రమంలోనే ఈమె వికారాబాద్‌లోని ఓ గ్రామంలో చిన్నపిల్లలతో సరదాగా ఆడుకుంటున్న ఓ వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.

ఇది చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. అందులో చాలా మంది చిన్న పిల్లలతో పాటు ఆవులు, మేకలు, కాకులు, కొంగల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. అచ్చంగా పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో అలా చూపించింది రేణు.

Exit mobile version