Site icon TeluguMirchi.com

రేణు చెప్పిన పెళ్లి కబుర్లు..

గత ఏడేళ్లుగా ఒంటరి జీవితం సాగించిన రేణు దేశాయ్..మరికొన్ని రోజుల్లో రెండో పెళ్లి చేసుకొని మరొకరి జీవితం లోకి వెళ్లబోతుంది. ఇటీవలే ఈమె నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈమెకు బెస్ట్ విషెష్ చాలామంది తెలుపగా , వారిలో తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ఉండడం విశేషం. రేణు తో విడాకులు ఇచ్చిన తర్వాత పవన్ మరొక పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉన్నాడు. కానీ రేణు మాత్రం మరో పెళ్లి చేసుకోవడానికి చాల ఏళ్లు ఆలోచింది. ఎట్టకేలకు మరో పెళ్లికి సిద్ధం అయ్యింది.

తాజాగా జాతీయ మీడియా తో మాట్లాడిన రేణు పెళ్లికి సంబదించిన కొన్ని విషయాలు పంచుకుంది. ‘ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నేను సంతోషంగా ఉన్నా.. కానీ నిజంగా అంత ఉత్సాహంగా లేను. ప్రేమ కేవలం ఒక్కసారే పుడుతుంది, మళ్లీ మళ్లీ ప్రేమలో పడలేం. గత ఏడేళ్లుగా ఒంటరిగా ఉన్నా, ఇన్నాళ్లూ నేను సంతోషంగానే ఉన్నా. ఆయన (కాబోయే భర్త) చాలా ప్రశాంతంగా ఉంటారు’ అని తెలిపింది.

అలాగే ‘మేమిద్దరం (రేణు, కాబోయే భర్త) బాగానే సంపాదిస్తున్నాం.. సహజీవనంలో ఎందుకు ఉండకూడదు అని కొందరు అన్నారు. కానీ నాకు అలాంటి బంధంపై నమ్మకం లేదు. గతంలో నేను సహజీవనంలోనే ఉన్నా.. అప్పుడు నాకు మరో ఛాయిస్‌ లేదు. కానీ ఇప్పుడు అలా ఉండాలి అనుకోవడం లేదు. నాకు 37 ఏళ్లు.. సంప్రదాయాలపై విశ్వాసం ఉంది. భారతీయ సంప్రదాయం ప్రకారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి అనుకుంటున్నా. నాకు పెళ్లిపైన నమ్మకం ఉంది. వివాహం అనేది ఓ అందమైన ప్రక్రియ. అందులో ఓ ప్రశాంతత ఉంది’ అని చెప్పుకొచ్చిది. నేను రెండో పెళ్లి చేసుకుంటున్నందుకు అకీరా బాధపడుతున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజానికి వాడు ఫంక్షన్‌ ఫుడ్‌ మెనూలో పన్నీర్‌ బటర్‌ మసాలా లేదని బాధపడ్డాడు’ అని చివర్లో తెలిపి అందరికి నవ్వు తెప్పించింది. కానీ తనకు కాబోయే భర్త విషయాలు మాత్రం పూర్తిగా వెల్లడించలేకపోయింది.

Exit mobile version