మంచు మనోజ్ , సందీప్ కిషన్ , నారా రోహిత్ మరియు నాగ శౌర్య వంటి చిన్న హీరోలంతా రెజీనా నే కావాలని పట్టుబడుతున్నారు. వీరితో చేసే దర్శక , నిర్మాతలు సైతం రెజీనా తోనే కమిట్ అవుతున్నారు. పెద్ద హీరోయిన్స్ పెట్టుకొని వారు అడిగిన పారితోషకం ఇవ్వలేక , ఒకవేళ ఇచ్చిన ఆ సినిమా అటు ఇటు అయితే మొదటికే మోసం వస్తుందని వారు కూడా రెజీనా కె ఓటు వేస్తున్నారు. ఇప్పటికే మనోజ్ తన కొత్త చిత్రం లో రెజీనా ను తీసుకోగా , సందీప్ నక్షత్ర కోసం ఈమెను పెట్టుకున్నాడు. ఇవి కాక రెజీనా చేతిలో మరో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. మొత్తానికి చిన్న హీరోలకు గోల్డెన్ భామ అయిపొయింది.