మెగా హీరోల దగ్గర ఓ సెంటిమెంట్ ఉంది. ఒకరితో ఆడిపాడిన కథానాయికకు మరొకరి సినిమాలో ఈజీగా ఛాన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం రెజీనాకు దక్కబోతోంది. సాయిధరమ్‌తేజ్ సినిమా పిల్లా నువ్వు లేని జీవితంలో కథానాయికగా నటించింది. ఆ తరవాత కొత్త .జంటలో శిరీష్ పక్కన ఆడిపాడే ఛాన్స్ దక్కింది. ఇప్పుడు మరో అల్లు హీరో.. బన్నీతో కలసి నటించబోతోంది. ఔను.. కొత్తజంట సినిమా చూసిన బన్నీ… రెజీనాకు పడిపోయాడట. `నా సినిమాలో నటిస్తావా?` అని అడిగాడట. బన్నీ అడిగితే ఏ హీరోయిన్ అయినా కాదంటుందా..??. ఓ యస్… అంటూ ఓకే చెప్పేసింది. మరి ఏ సినిమాతో ఈ జంట కనువిందు చేయబోతోందో చూడాలి. అన్నట్టు…. గీతా ఆర్ట్స్ తరపున రెజీనాను మరో సినిమాకి హీరోయిన్గా బుక్ చేసుకొన్నారు. మొత్తానికి ఈ కొత్త పిల్ల ప్రయాణం జోరుమీదే ఉంది.