క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం ‘నక్షత్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తన చిత్రాలలో హీరోయిన్ చాలా గ్లామర్‌గా చూపించే దర్శకుడు పాటల విషయంలో మరింత శ్రద్ద తీసుకుంటాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్‌లు నటిస్తున్నారు. రెజీనాను కొన్ని యాంగిల్స్‌లో చూసి యంగ్ రమ్యకృష్ణలాగా ఉందని, ఆమెపై మరింత శ్రద్ద కనబనిచాడట. కేవలం ఒక్క పాట కోసమే రెజీనాకు 18 డ్రస్సులు కేటాయించాడు. రెజీనా అందం తనకు బాగా నచ్చడంతో గ్లామర్‌గా కనిపించడానికి మరింత శ్రద్ద తీసుకున్నాడట.
కృష్ణవంశీనే స్వయంగా చెబుతూ ఒక్క పాటలో రెజీనా 18 డ్రస్సులలో కనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఇది కాస్త చిరాకైనా విషయమే అయినా కూడా రెజీనా మాత్రం ఓపికగా సహకరించదట. ఎంత నచ్చితే మాత్రం ఒక్క పాట కోసం 18 డ్రస్సులు కేటాయించాలా…?? అని యూనిట్ సభ్యులు కూడా అన్నారట. అయినా కూడా రెజీనాకు 18 డ్రస్సులు కేటాయించాడట. ఇకపోతే ఈ చిత్రంలో రెజీనా చాలా గ్లామర్‌గా కనిపించనుంది. అవకాశాల కోసం కూడా ఈ అమ్మడు అందాల ఆరబోతకు నో చెప్పలేదు. ఎంతలా చేసినా కూడా స్టార్ హీరోల ఆఫర్‌ు మాత్రం అందడం లేదు. ‘నక్షత్రం’తో రెజీనా మళ్లీ మెరువనుందా చూడాలి.