Site icon TeluguMirchi.com

ఈసారైనా రెజీనా గట్టెక్కేనా ..?

regina-chanceఅంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది..హీరోయిన్ రెజీనా కసాండ్రా పరిస్థితి..అందం.. ఆకర్షణ.. అభినయం.. అన్నీ ఉన్నా అమ్మడికి సరైన సక్సెస్ మాత్రం రాలేకపోతుంది..ఇండస్ట్రీ కి వచ్చి చాల రోజులు అవుతుంది కానీ అగ్ర హీరోల కన్ను మాత్రం ఈమె ఫై పడలేదు.. చిన్న హీరోలతో జత కట్టిన కానీ సరైన గుర్తింపు మాత్రం రాలేకపోయింది..

ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వం లో నక్షత్రం మూవీ లో నటిస్తుంది..కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు.. ఇలాంటి సమయంలో ‘హరే రామ హరే కృష్ణ’ అనే మూవీకి సైన్ చేసింది రెజీనా. కొత్త హీరోతో కొత్త దర్శకుడు రూపొందించే ఈ మూవీకి సెంట్రాఫ్ అట్రాక్షన్ రెజీనానే. అర్జున్ సాయి అనే నూతన దర్శకుడు హరే రామ హరే కృష్ణ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. దిలీప్ ప్రకాష్ అనే కుర్రాడితో రెజీనా రొమాన్స్ చేయనుంది.

రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కి ఈ మూవీలో హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ రోల్ లో రెజీనా కసాండ్రా కనిపించనుందట. మరి ఈ మూవీ అయినా రెజీనా కు కలిసొస్తుందో చూడాలి.

Exit mobile version