Site icon TeluguMirchi.com

తెలుసా.. నన్ను అంతా అలా అంటున్నారు

‘పెళ్లి చూపులు’ చిత్రం చిన్న సినిమాగా తెరకెక్కి విడుదలయ్యాక పెద్ద చిత్రం అయ్యింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ చిత్రంలో నటించిన విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మలు క్రేజీ స్టార్స్‌గా మారిపోయారు. ఇద్దరికి కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్‌ రీతూ వర్మకు మంచి సినిమాలలో ఆఫర్‌లు చేజిక్కుతున్నాయి. ఈ అమ్మడు నిఖిల్‌ సరసన ‘కేశవ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. తాజాగా ఈ చిత్రం కోసం ఇంటర్య్వూ ఇచ్చిన రీతూ తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో తన పాత్ర విభిన్నంగా ఉంటుంది అని దర్శకుడు సుధీర్‌ వర్మ తనకు మంచి పాత్ర ఇచ్చాడు అని చెప్పుకొచ్చింది.

సినీ ఇండస్ట్రీలో కొత్త వారికి పెద్దగా గౌరవం ఉండదు కానీ తనకు మాత్రం అలాంటి ఇబ్బంది ఏం లేదు అంటోంది. కొత్త హీరోయిన్‌ తంటాలు నాకేం లేవు, అంతా నన్ను మంచి నటిగా చూస్తారు, నటిగా గౌరవం ఇస్తారు అంటూ రీతూ చెప్పుకొచ్చింది. నటిని కాబట్టి ఎలాంటి పాత్రలో అయినా నటిస్తాను, అందాన్ని ఆరబోయడానికి పెద్దగా షరతులు ఏం లేవు, కథ డిమాండ్‌ చేస్తే అందుకు ఒకే అంటోంది. మంచి నటిగా ఈ అమ్మడికి గౌరరం దక్కుతుందని, అది చాలు అని రీతూ తెగ మురిసిపోతుంది.

Exit mobile version