రెడ్ టీజర్ రిలీజ్ డేట్

ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్..ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు.

నివేదా పేతు రాజ్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా మాళవికా మోహన్, అమృత అయ్యర్ మరో ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా టీజర్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు.

శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.