Site icon TeluguMirchi.com

చిరంజీవి అప్పుడే రికార్డ్స్ బ్రేక్ చేయడం మొదలుపెట్టాడు..

Khaidi-No150-First-Look-Motమెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు వెండి తెర ఫై చూద్దామని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు..దానికి తగట్టే చిరు సైతం తన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు..వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 60 % ఫైగా పూర్తి అయ్యిందని సమాచారం..

ప్రస్తుతం సెట్స్ ఫై ఉండగానే చిరు రికార్డ్స్ బ్రేక్ చేయడం మొదలుపెట్టాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ 13.5 కోట్లకి అమ్ముడు పోయాయని సమాచారం. ఇప్పటివరకు ఏ చిత్రాన్ని కూడా ఇంత ఎమౌంట్ పెట్టి ఎవరు కూడా తీసుకోలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ 10 కోట్లకి .. బ్రహ్మోత్సవం 13 కోట్లకి .. జనతా గ్యారేజ్ 7.25 కోట్లకి అమ్ముడయ్యాయి. అలాంటిది మెగాస్టార్ మూవీ వీటినన్నింటిని అధికమిస్తూ 13.5 కోట్లకి అమ్ముడు పోవడం అందర్నీ షాక్ లో పడేసింది..ఈ రైట్స్ చూసి చిరంజీవి స్టామినా ఎలాంటిదో మరోసారి రుజువయ్యింది.

ఈ చిత్రం లో చిరంజీవి కి జోడిగా కాజల్ నటిస్తుండగా , కేథిరెన్ ఓ ఐటెం సాంగ్ లో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఫై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 2017 సంక్రాంతి కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version