ఎట్టకేలకు పరిణితి చోప్రా కొత్త లుక్‌తో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘మేరీ ప్యారీ బింధు’ అనే చిత్రంలో నటిస్తుంది. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న పరిణితి చోప్రా సన్నగా, మరింత అందంగా కనిపిస్తుంది. ఈ సందర్బంగా పరిణితి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సమయంలో 9 నెలలు సినిమాలకు దూరంగా ఉండటం అంటే కాస్త కష్టమే అయ్యింది. అయితే తనను తాను మార్చుకోవడం కోసం తప్పలేదు అని, ఇప్పుడు తనలో చాలా పరిణితి వచ్చిందని, అలాగే తన శరీరం కూడా అందంగా తయారైందని, ఈ గ్యాప్‌లో చాలా విషయాలు నేర్చుకున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.