Site icon TeluguMirchi.com

రానాకి అనారోగ్యం : బరువు తగ్గడానికి అదే కారణమా !

బాహుబలి సినిమాలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన దగ్గుబాటి రానా, ఈ మధ్య కాలంలో బాగా సన్నబడిపోయాడు. దీన్తి రానా ఏదో జబ్బుతో బాధపడుతున్నట్టు టాలీవుడ్ లో రకరకాల గుసగుసలు వినిపించాయి. ఆ జబ్బు కారణంగానే రానా బక్క చిక్కిపోయారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం మొదలెట్టాయి.

అయితే తాజా ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ అలాంటిదేం లేదని చెప్పాడు. ‘హాథీ మేరే సాథీ’ సినిమా కోసమే సన్నబడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. మానవమాత్రులతో సంబంధం లేకుండా అడవిలోనే 30 సంవత్సరాలు వుండిపోయిన వ్యక్తి పాత్రలో కనిపించాలి కాబట్టి ఆ పాత్ర కోసం సన్నాబడాలని దర్శకుడు చెబితే అలాగే తగ్గుతూ వచ్చానని, సినిమా కోసం చేసిన చెంజోవర్ అని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత మళ్లీ డైట్ చేస్తే మళ్ళీ కండపట్టేస్తానని ఆయన చెప్పాడు. మొత్తానికి తన గురించి జోరుగా సాగుతోన్న ప్రచారానికి రానా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అ;ఆ తన ఆరోగ్యంపై రానా స్పష్టత ఇవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రానా ’విరాటపర్వం‘ సినిమాలో నటిస్తున్నారు.

Exit mobile version