‘రావణాసుర’ స్పెషల్ వీడియో..


రెండు భారీ హిట్స్ అనంతరం మాస్ మహారాజ్ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర”. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. కాగా హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

మరి ఈ సినిమా రేపు రిలీజ్ కానుండగా మాస్ మహారాజా అయితే స్పెషల్ వీడియో తో ఫ్యాన్స్ కి అలెర్ట్ ఇస్తున్నాడు. ఇక ఈ వీడియోలో రవితేజ నాచురల్ స్టార్ నానితో కలిసి.. మాస్ డైలాగ్స్ తో ‘రావణాసుర’ థియేటర్స్ లో ఫైర్ గా ఉంటుందని అంటున్నారు. మరి ఈ క్రేజీ థ్రిల్లర్ ఎలాంటి ట్రీట్ ని ఇస్తుందో చూడాలి.