Site icon TeluguMirchi.com

కిక్కు దొబ్బందనేనా.. ‘కిక్-2’

ravitejaవరుసగా ప్లాప్ సినిమాలతో మాస్ మహారాజా రవితేజకు ’కిక్కు’ దొబ్బిందట. అందుకే ఓ రేంజ్ లో కిక్కునిచ్చిన ’కిక్’ సినిమాకి సీక్వెల్ ను చేయాలనే యోచనలో వున్నాడట. ఇప్పటికే..  దర్శకుడు సురేంధర్ రెడ్ది  ’కిక్-2’ కథకు కసరత్తు మొదలెట్టాడట . ప్రస్తుతం సురేంధర్ రెడ్డి బన్నీ ’రేసుగుర్రం’తో బిజీగా వున్నాడు. ఇది ముగియగానే ‘కిక్-2’ స్ర్కీప్ట్ ను పూర్తిచేసే పనిలో వుంటాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే, ’కిక్’ మూవీలో హీరోయిన్ గా చేసిన ఇలియానా ప్లేస్ లో.. నేటి యంగ్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. వరుస ప్లాప్ లను మూటగట్టుకుంటున్న రవితేజ్, సురేంధర్ రెడ్డిలకు ‘కిక్’ సీక్వెల్ అయినా… హిట్ ’కిక్’ ఇవ్వాలని ఆశిద్దాం.. !

Exit mobile version