Site icon TeluguMirchi.com

Mr Bachchan : ‘మిస్టర్ బచ్చన్’ నుండి ‘జిక్కీ’ వచ్చేసింది !!


మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ పై ఎక్సయిట్మెంట్ పెరుగుతోంది. షోరీల్, మొదటి రెండు సింగిల్స్, టీజర్ థంపింగ్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఈ మూవీ నుండి ‘జిక్కీ’ అనే మరో రోమాంటిక్ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read : రూ.100 కే ‘కల్కి’ టికెట్..

ఈ పాటలో రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. ఇక మిక్కీ జే మేయర్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, రమ్య బెహరా ఆలపించారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు . ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది.

Also Read : లెక్కలు మాస్టారుగా మారిన ప్రియదర్శి.. పిల్లలు జాగ్రత్త మరి !

Exit mobile version