Mr Bachchan : కాశ్మీర్ వ్యాలీలో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మెలోడీ డ్యూయెట్..

Sonakshi Sinha : ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ..

మాస్ మహారాజా రవితేజ హీరోగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకుని ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్ వ్యాలీలో జరుగుతుంది.

Nagarjuna : క్షమాపణలు చెప్పిన నాగార్జున..?

రవితేజ, భాగ్యశ్రీ బోర్స్‌ పై బ్యూటీఫుల్ మెలోడీ డ్యూయెట్ ని షూట్ చేస్తున్నారు మేకర్స్. కాశ్మీర్‌లోని అద్భుతమైన లోకేషన్ లో ఈ పాట చిత్రీకరణ గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. లొకేషన్ సెలెక్షన్, సాంగ్ జానర్ సినిమాలో విజువల్ ఫీస్ట్, ఎమోషనల్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తోంది. ఈ పాటకు స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రవితేజ, హరీష్ శంకర్, అద్భుతమైన ప్రొడక్షన్ టీం సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

NKR21 : మళ్ళీ ‘వైజయంతి IPS’ గా విజయశాంతి.. ఫస్ట్ లుక్ అదుర్స్ !