మళ్ళీ ‘వీర’ కాంబినేషన్

ravi teja and ravi veramఓ సారి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేయడానికి హీరోలు భయపడతారు. కానీ రవి తేజ మళ్ళీ మళ్ళీ వాళ్ళనే నమ్ముకుంటారు. ‘షాక్’ ఇచ్చిన హరీష్ శంకర్ కి మరో అవకాశం ఇచ్చారు ‘మిరపకాయ్’ సినిమాతో. ఆ హిట్ తో హరీష్ పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు మరో ఫ్లాప్ దర్శకుడి ని నమ్మి అవకాశం ఇచ్చేపనిలో వున్నాడు. ఆయనే రమేష్ వర్మ. రవితేజని ‘వీర’గా చూపించింది ఆయనే. ఆ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టుకోలేక పోయింది. అయినా రమేష్ పై నమ్మకంతో.. మరో సినిమా అప్పజెప్పారు. రమేష్ వర్మ- రవి తేజ కలయికలో ఓ సినిమా రావడానికి సర్వం సిద్ధం అవుతోంది. ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమాతెరకెక్కిస్తారు. ప్రస్తుతం రవి.. ‘బలుపు’ చుపించబోతున్నారు. ఆ సినిమా పూర్తయిన తరవాత రమేష్ వర్మ సినిమా మొదలయ్యే అవకాశం వుంది.