Site icon TeluguMirchi.com

బలుపు చూపించినా స‌రే…

ravitejaఓ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే, మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించ‌డం ర‌వితేజ శైలి. ఫ్లాప్‌లొచ్చినా స‌రే – ఇదే వేగం కొన‌సాగించాడు. వ‌రుస ప‌రాజ‌యాల త‌ర‌వాత ఓ హిట్ కొట్టి, ఫామ్‌లొకి వ‌చ్చిన త‌ర‌వాత మాత్రం ఖాళీగా ఉన్నాడు. బ‌లుపు సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం సాధించింది. అయినా స‌రే – ద‌ర్శకులలు, నిర్మాత‌లు ఈ మాస్ మహారాజాకు దూరంగా ఉన్నారు. పెద్ద ద‌ర్శకులైతే లైట్ తీసుకొన్నారు. అందుకే కొత్త ద‌ర్శకుల‌తో జ‌త క‌ట్టాల‌ని ర‌వితేజ భావిస్తున్నాడు. బ‌లుపు సినిమాకి క‌థార‌చ‌యిత‌గా ప‌నిచేసిన బాబీకి ఆయ‌న ఆఫ‌ర్ ఇవ్వనున్నట్టు స‌మాచార‌మ్‌! కొత్త ద‌ర్శకుడి చేతిలో సినిమా పెట్టడం రిస్క్ అనుకొంటే మాత్రం… కాస్తో కూస్తో అనుభ‌వం ఉన్న ద‌ర్శకుడి వైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ ఛాయిస్ ర‌వితేజ చేతిలో లేదు. ఆయా ద‌ర్శకుల చేతిలో ఉంది. ఇదంతా గ‌త పరాజయాల ఫ‌లిత‌మే. అవ‌న్నీ ఇప్పుడు.. ఇలా ప్రభావం చూపిస్తున్నాయి.

Exit mobile version