Site icon TeluguMirchi.com

మిరపకాయ్‌ ఘాటు తగ్గిందట!

ravitejaఇదేదే మనం కూరలో వాడుకునే మిరపకాయ ఘాటు కాదండోయ్‌! తెలుగు తెరపై తన పంచ్‌ డైలాగులతో, తన మ్యానరిజాలతో ఘాటెక్కించిన మిరపకాయ్‌ హీరో రవితేజ గురించిన విషయమన్న మాట. ఇటీవల రవితేజ డబల్‌ హ్యాట్రిక్‌ కొట్టేశాడు. అదేదో వరుసగా హిట్లతో అయితే అందరికీ సంతోషమే అయ్యుండేదేమో! కానీ ఈ డబల్‌ హ్యాట్రిక్‌ తన వరుస ఫ్లాపులతో వచ్చింది పాపం. లేటెస్ట్‌ గా వచ్చిన సారొచ్చారు కూడా బాక్సాఫీసు వద్ద బోర్లా పడిపోవడంతో రవితేజ పరిస్థితి అంతుపట్టకుండా మారిపోయినట్టు వినికిడి. మొన్నమొన్నటి వరకూ మాంచి డిమాండ్‌ మీద ఉన్న హీరోల్లో తనూ ఒకడిగా ఉండేవాడు. అసలు “సారొచ్చారు” ప్రాజెక్ట్‌ ఓకే అయ్యేనాటికి మనోడు దాదాపు 5కోట్లు పారితోషికం రేంజ్‌ లో ఉండేవాడు. అసలే వైజయంతీ బ్యానర్‌.. ఆపై అశ్వనీదత్‌ స్టేటస్‌ అనుకున్నాడేమో.. ఏకంగా ఆ సినిమాకి 7కోట్లు డిమాండ్‌ చేశాడట. కానీ పరిశ్రమ పెద్దలు నచ్చజెప్పడంతో ఐదు చదివింపులకే ఓకే చేసేసినట్టు సమాచారం. తీరాచూస్తే అది బాక్సాఫీసు వద్ద శబ్ధం లేకుండా తుస్సుమంది. దీంతో తెలుగు నిర్మాతలు రవితేజ పేరు తల్చుకోవడం మానెయ్యడమే కాదు… ఆపేరు వినాలంటే కూడా జంకుతున్నారట. ఇలా అయితే తను తట్టా, బుట్టా సర్దేసుకుని రైలెక్కేసినట్టే అని డిసైడ్‌ అయిపోయిన రవితేజ ఇప్పుడు ఓ కొత్త పాలసీ మొదలెట్టాలనుకుంటున్నాడట. ఇకపై తాను ఒప్పుకోబోయే సినిమాలకు ముందుగా డబ్బులేమీ తీసుకోకుండా, ఏకంగా సినిమా విడుదలయి సక్సెస్‌ సాధించాక పారితోషికం తీసేసుకుందాం అన్న నిర్ణయానికొచ్చాడట. ఐడియా అయితే బానే ఉంది. అందరు హీరోలూ ఇలానే డిసైడ్‌ అయితే నిర్మాతలు ప్రశాంతంగా సినిమాలు తీసేసుకోవచ్చేమో… కానీ ఇది జరిగే పనేనా అన్నదే కొచ్చెను….

Exit mobile version