’కిక్కు’న్న పోలీస్ పాత్రలో రవితేజ!!

raviteja-in-kick-2రవితేజ మరోసారి లాఠీ పట్టనున్నాడు. సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ’కిక్’. ఇప్పుడు ‘కిక్’ సినిమాకి సీక్వెల్ గా ‘కిక్ 2’ రాబోతోంది. మొదటి వర్షన్ లో హీరో(రవితేజ) పోలీసు ఆఫీసర్ అవడంతో సినిమాకు శుభం కార్డు పడుతోంది. తాజా స్వీక్వెల్ ‘కిక్-2’లో రవితేజ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఈ సినిమాకి మరో విశేషం కూడా వుంది. అదే నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించడం. కిక్ కోసం ’కిక్-2’లో మరెన్ని యెశాలేస్తాడో మాస్ మహారజా. అన్నట్టు ’కిక్-2’ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.