Site icon TeluguMirchi.com

రవితేజ ఆరోగ్యం పై వస్తున్న వార్తలు నిజమేనా..?

Ravi-Teja-Helathమాస్ మహారాజా రవితేజ గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. ఏడాది కి రెండు సినిమాలతో అలరించే రవితేజ , కొంతకాలంగా సైలెంట్ అయ్యాడు. తన చివరి చిత్రం బెంగాల్ టైగర్ రిలీజ్ అయి కూడా 8 నెలలు కావొస్తున్నా , తన తదుపరి చిత్రం ఇంతవరకు సెట్స్ పైకి రాకపోవడం తో రవితేజ కు ఏమయ్యింది అనే అనుమానాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.

ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే నెక్స్ట్ చేయబోయే చిత్రాన్ని లైన్ లో పెట్టె రవితేజ ఇంత వరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటన చేయకపోయేసరికి తన ఆరోగ్యం పై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం రవితేజ మరికొద్ది రోజుల్లో ఫారెన్ వెళ్తున్నాడ‌ని తెలుస్తోంది. ఒక రిసార్ట్ లో ఈ థెర‌పీ ట్రీట్మెంట్ తీసుకుని మ‌రింత స్లిమ్ గా , గ్లామ‌ర్ గా తయారుఅవడానికి ప్లాన్ చేసాడని అందుకే తన కొత్త చిత్రం కోసం కాస్త గ్యాప్ తీసుకున్నాడని సమాచారం.

Exit mobile version