రవితేజ ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో మాదిరిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకుండా మెల్లగా జాగ్రత్తగా సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా డిస్కో రాజా తుది దశకు చేరుకుంది. ఈ సమయంలోనే రవితేజ తర్వాత సినిమా పై ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. తమిళంలో హిట్ అయిన ‘విక్రమ్ వేద’ రీమేక్‌లో రవితేజ నటించబోతున్నాడు. చాలా కాలంగా ఈ రీమేక్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి ఆ సినిమా పట్టాలెక్కేందుకు రెడీ అయ్యింది.
‘రణరంగం’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ వర్మ ఈ రీమేక్‌కు డైరెక్షన్ చేయబోతున్నాడు. రణరంగం చిత్రం నిరాశ పర్చడంతో రీమేక్‌పై ఈసారి దృష్టి సారించాడు. రీమేక్ చేయడం వల్ల సక్సెస్‌పై ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా పెద్దగా ప్రభావం ఉండదు అనేది సుధీర్ వర్మ అభిప్రాయం అయ్యి ఉంటుంది. అందుకే ఈ చిత్రంను రీమేక్ చేసేందుకు రవితేజను ఒప్పించాడు. పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటించబోతుండగా, విలన్‌గా డాన్ పాత్రలో కార్తికేయను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనతో కథ చెప్పి ఒప్పించాల్సి ఉంది.