గతంలో రవితేజ రెండు సార్లు రాశిఖన్నాతో నటించాడు. బెంగాల్ టైగర్ మరియు టచ్ చేసి చూడు చిత్రాల్లో రవితేజ మరియు రాశిఖన్నాలు కలిసి రొమాన్స్ చేశారు. కాని రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలయ్యాయి. ఆ ఫలితాలను పట్టించుకోకుండా ముచ్చటగా మూడవ సారి వీరిద్దరు కలవబోతున్నారు. మరి మహాసముద్రం ఈ జంటకు హ్యాట్రిక్ ఫ్లాప్‌ను ఇవ్వబోతుందా లేదంటే మొదటి సక్సెస్‌ను కట్టబెట్టబోతుందా చూడాలి. సహజంగా హీరోలు ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువగా నమ్ముతారు. ఒక హీరోయిన్‌తో రెండు సినిమాలు ఫ్లాప్ అయితే మరోసారి ఆమెను ట్రై చేయరు. కాని రవితేజ మాత్రం అలాంటి పట్టింపు లేకుండా రాశిఖన్నాతో చేయబోతున్నాడు.