Site icon TeluguMirchi.com

రష్మిక రేటు మరి ఇంత చీపా..

ఛలో చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన రష్మిక మండన్న..మొదటి చిత్రం తోనే యూత్ కు బాగా దగ్గరయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం చిత్రం లో నటించి తన సత్తా చాటుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈమెకు వీరాభిమాలు అయ్యారు. తాజాగా నాగ్- నాని కాంబినేషన్ లో వచ్చిన దేవదాస్ చిత్రం లో నాని సరసన నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా చేసిన మూడు సినిమాలు హిట్లు కావడం తో అమ్మడిని గోల్డెన్ లెగ్ అని నిర్మాతలు పిలుచుకుంటున్నారు.

సాధారణంగా ఓ హిట్ వస్తేనే హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్లను భారీ గా పెంచడం , అలాగే షాప్ ఓపెనింగ్ లకు భారీ డిమాండ్ చేయడం చేస్తుంటారు. కానీ రష్మిక మాత్రం అందరిలా కాకుండా మూడు హిట్లు వచ్చిన కానీ తన రేటును ఏమాత్రం పెంచలేదట. ఓ షో రూమ్ ఓపెనింగ్స్ కు గాను కేవలం 5లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకుంటుందట. మాములుగా సాధారణ హీరోయిన్లు సైతం షాప్ ఓపెనింగ్స్ కు 10లక్షల పాటు తీసుకుంటారు. కానీ రష్మిక మాత్రం చాల తక్కువ తీసుకుంటూ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమా విషయంలోను ఇలాగే చేస్తూ నిర్మాతల పాలిట బంగారు రష్మిక అవుతుంది. ప్రస్తుతం ఈమె తెలుగు లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది.

Exit mobile version