బెంగళూరు, చెన్నై నిన్న రాత్రి హైదరాబాద్. ఇలా వరుసగా మూడు రోజులు ఏమాత్రం అలసి పోకుండా విజయ్ దేవరకొండ మరియు రష్మికలు స్టేజ్ షోలు ఇస్తున్నారు. ముఖ్యంగా చాలా కష్టమైన డాన్స్ స్టెప్పులను రష్మిక చేస్తూ వచ్చింది. కేవలం ఒకటి రెండు కాకుండా పలు పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చి అభిమానులను మరియు ప్రేక్షకులను మెప్పించింది. ఈమె చేసిన డాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మ్యూజిక్ ఫెస్ట్‌లో రష్మిక చేసిన డాన్స్‌లు వైరల్ అవుతున్నాయి. రష్మిక ఎనర్జికి ఫ్యాన్స్ ఫిద అవుతున్నారు.