తాజాగా వైజాగ్‌లో మ్యూజిక్ ఫెస్టివల్లో రష్మిక పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మళ్లీ విజయ్‌తో నటించవద్దని నా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే జరిగింది చాలు మళ్లీ అతడితో నటిస్తే ఈ ప్రచారం ఎక్కువ అవుతుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికైనా అతడి నుండి దూరంగా ఉండమని నాకు చెబుతున్నారు. మీడియాలో వస్తున్న వార్తలకు వారు భయపడుతున్నారు. నా గురించి పూర్తిగా తెలిసినా కూడా వారు మీడియాలో కథనాలను ఎక్కువగా పట్టించుకుంటున్నారు. మళ్లీ విజయ్ తో నటించక పోవచ్చు అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. రష్మిక ప్రకటన ఈ జంట ఫ్యాన్స్‌కు నిరాశ మిగిల్చింది.