బాలీవుడ్ లో బిజీ కాబోతున్న రష్మిక, ట్యూటర్ అందుకేనా ?

టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మిక ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రెండు హిందీ సినిమాలలో రష్మిక నటిస్తుంది. సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి మిషన్ మజ్ను, అమితాబ్ బచ్చన్ తో గుడ్ బాయ్ చిత్రాల్లో నటిస్తుంది. తనకు బాలీవుడ్ ఆఫర్లు ఎక్కువ వస్తుండడంతో
తన హిందీ భాషా పరిజ్ఞానాన్ని పెంచుకొనే పనిలో పడిందట ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ప్రస్తుతం ట్యూటర్ ని పెట్టుకుని మరీ హిందీ భాష నేర్చుకుంటోంది. తద్వారా భాషపై పట్టు సాధించాలని ఈ చిన్నది కోరుకుంటోంది. ఇప్పటికే కొందరు హీరోయిన్లు టాలీవుడ్ లో టాప్ పోసిషన్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ లో ఫెయిల్ అయి అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో ఆఫర్లు లేక ఖాళీగా ఉంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అయిన బాలీవుడ్ లో నెట్టుకొస్తుందేమో చూడాలి.