రౌడీ గురించి గీత మళ్లీ అదే మాట

విజయ్‌ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం సెన్షేషనల్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం విజయంతో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను ఈ జంట ఏర్పర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ అప్పటి నుండి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వచ్చిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో కూడా విజయ్‌ దేవరకొండ మరియు రష్మికలు రొమాన్స్‌ పండించారు. వీరిద్దరి మద్య రొమాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. తాజాగా మరోసారి వీరిమద్య లవ్‌ గురించిన చర్చ మొదలైంది.

మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో రష్మిక మరోసారి స్పందించింది. తనకు విజయ్‌ మంచి స్నేహితుడు మాత్రమే. అంతుకు మించి ఏమీ లేదు. మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు వస్తుంటే నా సినీ కెరీర్‌ మరియు నా వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడ్డట్లయ్యింది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె చేసిన ప్రకటనతో ప్రస్తుతం ఇద్దరి మద్య ప్రేమలేదని జనాలు అనుకోరు. ఎందుకంటే ఇద్దరిమద్య ప్రేమ ఉందని జనాల్లో బలంగా నాటుకు పోయింది. కనుక ఇద్దరు ఎంతగా కొట్టి పారేయాలని చూసినా కూడా దాన్ని పట్టించుకోకుండా ముచ్చటించుకుంటూనే ఉంటారు.