ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి విపత్తులు వచ్చిన ముందుగా స్పందించే టాలీవుడ్ ఇండస్ట్రీ..ఇప్పుడు కరోనా మహమ్మారి ఫై అలాంటి సాయమే చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాటికీ తమవంతు గా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ విరాళాలు ప్రకటించగా తాజాగా యాంకర్ రష్మీ రూ. 25 వేల సహాయాన్ని PMcares కు విరాళంగా ఇస్తున్నట్టు ట్వీట్ చేసింది. కష్ట సమయంలో ప్రధాన మంత్రి సహాయనిధికి తన వంతుగా విరాళం ఇచ్చానని , మీరు కూడా మీవంతుగా అంతో ఇంతో సాయం చేయాలని కోరింది.
గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ ఛారిటీ కి సైతం అనేక మంది విరాళాలు అందజేస్తున్నారు.
I have donated 25000 as of now
will be doing my bit by donating to a few honest NGO's too while I use my resources too feed the hungry voiceless around
Requesting one and all to do there bit too come forward and help in which ever way possible pic.twitter.com/yYHiq4LZm1— rashmi gautam (@rashmigautam27) March 30, 2020