ఈ మధ్య సోషల్ మీడియా లో ఫేమస్ కావడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఫేమస్ కావడం కోసం చూస్తున్నారు. ఇప్పటికే పలువురు అలంటి విన్యాసాలు చేసి మృత్యు వాతపడ్డారు.
తాజాగా ఓ టిక్‌టాక్ యూజర్ జంతువులను హింసిస్తూ ఫేమస్ కావాలని చూసాడు.ఈ వీడియో యాంకర్ రష్మీ గౌతమ్ కంట్లో పడింది. నరేశ్ అనే ఐడీ పేరుతో ఉన్న టిక్‌టాక్ వీడియోలో ఓ వ్యక్తి కుక్క పిల్లను పట్టుకుని నిల్చున్నాడు. కెమెరా వైపు చూసి అతని స్నేహితుడు ఓకే చెప్పగానే నిర్దాక్షిణ్యంగా ఆ కుక్కపిల్లను కాలువలోకి పడేశాడు. ఆ మూగప్రాణి ఈదుకుంటూ ఎలాగోలా ఒడ్డుకైతే రాగలిగింది. అతని చేతిలో ఉన్న జంతువు పరిస్థితి తల్చుకున్న రష్మీకి మనస్సు కదిలిపోయింది.
“అందుకే మనుషులు అంతరించేందుకు అర్హులవుతున్నారు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోండంటూ జంతు ప్రేమికురాలైన బీజేపీ నేత మేనకా గాంధీకి ఫిర్యాదు చేసింది. కాగా ఈ వీడియోపై జంతు ప్రేమికులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
యాంకర్ రష్మీ సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ సమాజ సేవ పట్ల ముందుటుందనే సంగతి తెలిసిందే. తాజాగా కరోనా మహమ్మారి ఫై రష్మీ సాయం చేసి వార్తల్లో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాటికీ తమవంతు గా విరాళంగా రూ. 25 వేల సహాయాన్ని PMcares కు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకుంది.
Man
Humans deserve to be extinct @Manekagandhibjp @AskAnshul pls tag people who you guys think can help https://t.co/zM23p0iExI— rashmi gautam (@rashmigautam27) April 7, 2020