ఒకప్పటి హాట్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రాశి తాజాగా ‘లంక’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందకు రాబోతుంది. పెళ్లి అయ్యి, ఒక కూతురుకు జన్మనిచ్చిన రాశి భారీగా తన ఒంటిని పెంచేసింది. అయినా కూడా ఈ అమ్మడు ఒక కీలక పాత్రను పోషిస్తూ ‘లంక’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న రాశి అప్పట్లో సినీ పరిశ్రమలో హీరోయిన్లకున్న స్థానాన్ని గుర్తు చేసింది. ఎంత బాగా నటించినా, అందాలను ఎంతలా ఆరబోసినా కూడా హీరోయిన్లను చులకనగానే చూసేవారు. సినిమా విజయంలో హీరోయిన్ పాత్ర చాలా ఉన్నా కూడా హీరోయిన్లకు కనీస గౌరవం కూడా ఉండేది కాదు అంటూ రాశి చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హీరోయిన్లకు సదుపాయాలు బాగానే ఉన్నాయి, గౌరవ మర్యాదలు కూడా పెరిగాయని రాశి అంటోంది. గతంలో అవుట్ డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడు హీరోయిన్లకు కనీస సదుపాయాలు కూడా ఉండేవి కావు. ఒక్కోసారి బయట, అందరి ముందే బట్టలు విప్పాలి వచ్చేది. చేసేది లేక ఆరు బయటనే బట్టలు మార్చుకునేది నాకు కూడా కొన్ని సార్లు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో తప్పదు కాబట్టి అలా చేయడానికి కూడా తలవంచే వాళ్లం, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగయ్యాయి అని రాశి చెప్పుకొచ్చింది.