అపాయింట్మెంట్ లేని కారణంగా పవన్ సిబ్బంది రాశిని చాలాసేపు బయటే వెయిట్ చేయించారట. పవన్‌ను కలవడానికి కూతురుతో సహా వెళ్లిన రాశి బయటే చాలాసేపు కూర్చుందట. రాశి బయట ఉన్నట్టు పవన్‌కు తెలియకపోవడంతో ఇలా జరిగింది. అనంతరం పవన్‌కు రాశి వచ్చింది అని తెలియగానే వెంటనే లోపలికి పిలిపించాడట. చాలాసేపు పవన్, రాశిలు మాట్లాడుకున్నారట. ఎక్కువ సేపు పిల్లల గురించే మాట్లాడుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా రాశినే చెప్పుకొచ్చింది. నిజానికి ‘గోకులంలో సీత’ సమయంలో కంటే తాను ఇప్పుడే పవన్‌తో ఎక్కువ మాట్లాడాను అని రాశి అంటోంది.