వరుణ్ తేజ్ ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావొస్తుండగానే తదుపరి చిత్రంకు సన్నాహాలు చేస్తున్నాడు. తదుపరి చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్గా మెహ్రీన్ కౌర్‌ను ఎంపిక చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల మెహ్రీన్‌ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించేశారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా రకుల్‌ను ఎంపిక చేయాలని భావించగా డేట్స్ కుదరక పోవడంతో రకుల్ నో చెప్పింది. దాంతో చిత్ర యూనిట్ వెంటనే వాశి ఖన్నాను సంప్రదించారు. మరో మెగా ఆఫర్ రావడంతో రాశి వెంటనే ఒకే చెప్పింది. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు మరో మెగాహీరోతో రొమాన్స్‌కు సై అంది.