రాశిఖన్నాకు తొలి అనుభవం

తొలిప్రేమ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ను మీడియాతో షేర్ చేసుకుంది రాశిఖన్నా. 17ఏళ్ల వయసులో తొలిసారి తనకు వచ్చిన ఓ ప్రపోజ్ గురించి చెప్పింది.

నా పదిహేడవ ఏట ఓ అబ్బాయి లవ్ ప్రపోజల్ చేశాడు. నాకు అంతవరకూ ప్రేమంటే ఏంటో తెలియదు. ఏం చెప్పాలో అర్ధం కాలేదు. తనతో ఏం చెప్పకుండానే మౌనంగా వెళ్లిపోయా. ఆ అబ్బాయి మాత్రం నన్ను కొన్నాళ్లు అనుసరించాడు. నేనేం మాట్లాడేదాన్ని కాదు. అలాగని ప్రోత్సహించేదాన్నీ కాదు. దాంతో ఆ అబ్బాయికి విసుగొచ్చేసింది. నాతో ప్రేమకు గుడ్‌బై చెప్పేశాడు. నా జీవితంలో చోటుచేసుకున్న అప్పటి తొలిప్రేమ సంఘటన ఈ ‘తొలిప్రేమ’లో నేను పోషిస్తున్న పాత్రకు బాగా ఉపయోగపడింది” అని చెప్పుకొచ్చింది రాశి.

రాశి ఖన్నా హీరోయిన్ గా వరుణ్‌తేజ్‌ సరసన నటించిన చిత్రం ‘తొలి ప్రేమ’. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.