Site icon TeluguMirchi.com

Rao Ramesh : రావు రమేష్ హీరోగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’.. ప్రేక్షకులే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌


వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్ ఇప్పుడు హీరోగా వస్తున్న చిత్రం ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందుతోంది. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఇక ఈ చిత్రంలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలను చాలా వినూత్నంగా ప్లాన్ చేశారు.

Om Bheem Bush : ఇలాంటి కథ ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై రాలేదు : డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి

సాధారణంగా సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయించడం కామన్. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ టీమ్ కొత్తగా ఆలోచించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేయమని ప్రేక్షకుల్ని కోరింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా ఒక సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. “మారుతి నగర్ సుబ్రహ్మణ్యం.. ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి” అని విజ్ఞప్తి చేశారు.

Maruthi Nagar Subramanyam First Look | Rao Ramesh | Lakshman Karya|PBR Cinemas|Lokamaatre Cinematics

Exit mobile version