Site icon TeluguMirchi.com

రేపే రంగస్థలం సక్కగున్న పాట


రంగస్థలం సినిమా షూట్ పార్ట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మొన్నటికి మొన్న విడుదల చేసిన సమంత టీజర్ కు విపరీతమైన అప్లాజ్ వచ్చింది. దాదాపు అన్నీకలిపి పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఆ ఉత్సాహంతో ఫస్ట్ సాంగ్ ను రేపు విడుదల చేస్తున్నారు. సమంతను తలుచుకుంటూ, హీరో రామ్ చరణ్ పాడే ప్రేమగీతం ఇది. ఎంత సక్కగున్నావే అనే లిరిక్ తో సాగుతుంది.

దేవిశ్రీ ప్రసాద్‌ ‘రంగస్థలం’ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. జగపతిబాబు, అనసూయ, ఆదిపినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమంత, రామ్ చరణ్ లతో 1985 నాటి పీరియడ్ డ్రామాను చూపించబోతున్నాడు దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో.

Exit mobile version