ట్రైలర్ టాక్: రంగస్థలం

‘చిట్టిబాబు చెవిలోకి మాటెళ్లడం కష్టం గానీ… ఒక్కసారి వెళ్లిందంటే అది గుండెల్లో ఉండిపోద్దయ్యా” అంటున్నాడు రామ్ చరణ్. మెగా ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రంగస్థలం థియేట్రికల్‌ ట్రైలర్‌ వచ్చేసింది. ఈ ట్రైలర్ లోని డైలాగ్ ఇదే.

‘మా ఇంజన్‌కు కులం గోత్రాలు ఉండవు ఏ చేను అయినా తడిపేస్తది అంతే. గిల్లుతున్నావేంటి గాజులు కొనిపెట్టమంటే..! ఆకట్టుకుంటున్నాయి. గ్రామ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెరకెక్కించారు. జగపతిబాబు ప్రెసిడెంట్ పాత్రలో కనిపించాడు. కొన్ని యాక్షన్ సన్నీవేషాలు బావున్నాయి. చరణ్ కు అన్న పాత్రలో ఆది పినిశెట్టి కనిపించాడు. సమంత డీ గ్లామర్ లో కనిపించింది. చరణ్ పాత్ర చెవిటిది. అయితే పూర్తి చెవిటి కాదు కాస్త గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుంది. మరి చిట్టిబాబు సంగతెంటో మీరూ ఓ పాలి సూడండి.